Friday, February 22, 2013

మనసా నీవాసమేడ?

కననైతినినీరూపును
విన నైతిని నీదు వాణి వివరిoపంగన్ 
తనువెల్ల తరచి చూచితి
మనసా నీవాసమేడ? మనుజుల లోనన్!!!   




Thursday, February 21, 2013

ఓటరు దేవా !!!



తప్పుడు నడతల వారల
కొప్పునె పట్టంబు గట్ట ఓటరు దేవా
నిప్పును తలపై బెట్టిన
చప్పున నిలువెల్ల గాల్చి  చంపును గాదే !!!



Wednesday, February 20, 2013

గోవింద కాపాడవే !!!


 
హరివై   శంభుడవై   చతుర్ముఖుడవై  అoభొధివై    అగ్నివై 
సిరివై    పార్వతివై   విధాతసతివై       జీవంబువై వాయువై 
ధరవై    సుర్యుడవై  సుధాకరుడవై    దైవంబువై     నింగివై 
గురువై  పూర్ణుడవై  పరాత్పరుడవై    గోవింద కాపాడవే !!!