Monday, February 28, 2011

మత్తెక్కిన భద్ర గజము మాంసము దినియెన్!!!

చిత్తము మంత్రుల కెప్పుడు ,
విత్తము నందే తిరుగును వివరణ లేలా !
ఉత్తమ ఐరా వతములె ?
మత్తెక్కిన భద్ర గజము మాంసము దినియెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో24-01 -2011 నాటి  సమస్యా పూరణ-205లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, February 26, 2011

సాఫ్టు వేరు మగని జాడ గనిరె !!!

షిఫ్టు డ్యూటి యనుచు సాఫ్టుగా జెప్పును
సరస మాడు మంటె సైటు జూచు
రేయి బవలు దిరుగు రేసుగుఱ్ఱమురీతి
సాఫ్టు వేరు మగని జాడ గనిరె!
(శంకరాభరణం  బ్లాగు లో23-01 -2011 నాటి  సమస్యా పూరణ-205లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, February 25, 2011

రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్!

యువతీ కాశ్మీరమ్మిది,
ధవళమ్మగు మంచు గురియు, తనువులు వణుకున్,
పవలును కావలె రగ్గులు,
రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్! 

యువతీ కాశ్మీరమ్మిది,
ధవళమ్మగు మంచు గురియు, తనువులు వణుకున్,
యువకుని కౌగిట నుండగ
రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్! 

అన్నా యని రాము బిలిచె నవనిజ భక్తిన్!

ఉన్నావెక్కడ? లక్ష్మణు
డన్నా యని రాము బిలిచె ! నవనిజ భక్తిన్
తన్నున్ గొనిపోయెడుచెడు
పన్నాగంబును దెలియక పాపిని జేరెన్ !
(శంకరాభరణం  బ్లాగు లో20-01 -2011 నాటి  సమస్యా పూరణ-203లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, February 24, 2011

భీష్ముడు శిఖండిని ! వరించి పెండ్లి యాడె

యుద్దములు పలు జేసిన యోధు డతడు
అస్త్ర సన్యాసమును జేసె నరయ జూసి
భీష్ముడు శిఖండిని ! వరించి పెండ్లి యాడె
హరిని, భీష్మకుని తనయ ! హరియు  మురిసె! 
(శంకరాభరణం  బ్లాగు లో19-01 -2011 నాటి  సమస్యా పూరణ-202లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, February 23, 2011

కస్తురి తిలకమ్ము! గరళ మయ్యె !

శుభము నిచ్చు నేది ? సుఖము నార్పున దేది?
హరికి నుదుట నెపుడు మెరియు నేది?
శివుని గళము నందు చేరియుండిన దేది?
కస్తురి తిలకమ్ము! గరళ మయ్యె ! 

ఎందు గలడు వాడు ? ఎచ్చోట నున్నాడు ?
గగన మందు గలడె? గలెడె వార్ధి ?
స్తంభ మందు హరిని సంబ్రమంబున గాంచె,
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె !
(శంకరాభరణం  బ్లాగు లో18-01 -2011 నాటి  సమస్యా పూరణ-201లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, February 22, 2011

"కొంగ కైదు కాళ్ళు కోడికి వలె"నుండు!!!

"కొంగ కైదు కాళ్ళు కోడికి వలె"నుండు
ననెడు దొంగలెపుడునవని చేటు !
చార్మినారు నమ్మె కూర్మి మాటల జెప్పి
భరణి నవ్వు లొలుకు బ్రహ్మ మునకు !

(ఒక సినిమాలో పల్లె నుండి వచ్చిన అమాయక బ్రహ్మానందం ను మాటల్లో పెట్టి ,నమ్మించి మోసగించిన తనికెళ్ళ భరణి గారి హాస్య సన్నివేశం దృష్టిలో పెట్టుకొని పూరించాను .సినిమా పేరు గుర్తుకు రావడము లేదు)

Monday, February 21, 2011

భామకు చీరేలనయ్య పదుగురు చూడన్ !!!

సోమా వారపు సంతలొ
రామా చిలుకొకటి గోరె రంగుల చీరెన్!
దోమా చీమకు గొల్లా
భామకు చీరేలనయ్య పదుగురు చూడన్ !!! 
(శంకరాభరణం  బ్లాగు లో16-01 -2011 నాటి  సమస్యా పూరణ-199లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, February 20, 2011

పండుగ దినమందు పాత మగడె!

నిండు చందు రుండు నిజమైన చెలికాడు,
అండనుండు నెపుడు కొండ రీతి,
కొంటె వాడు, మదికి క్రొత్తగా కనుపించు ,
పండుగ దినమందు పాత మగడె!
(శంకరాభరణం  బ్లాగు లో15-01 -2011 నాటి  సమస్యా పూరణ-198లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, February 15, 2011

బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర!!

కాఫి, సిగరెట్టు, విడియమ్ము,కార్డు లాట,
రేసు గుర్రాలు ,బ్రాకెట్టు రేయిపగలు
మోహ తాపమ్ము,పానమ్ము మోదమౌట
బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర!! 
(శంకరాభరణం  బ్లాగు లో14-01 -2011 నాటి  సమస్యా పూరణ-197లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, February 14, 2011

వచ్చె సంక్రాంతి లక్ష్మి! యేమిచ్చు మనకు?

వత్సరమ్మున కొకసారి వచ్చు లక్ష్మి
పంటలన్నియు చెడ, పెట్టె కంట నీరు ,
రెక్క లూడిన పక్షిలా బిక్క బోయి
వచ్చె సంక్రాంతి లక్ష్మి! యేమిచ్చు మనకు?

(శంకరాభరణం  బ్లాగు లో13-01 -2011 నాటి  సమస్యా పూరణ-196లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, February 13, 2011

స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె !!

స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె
ననుట సత్య దూరము గాదె! నరయ గాను ,
శునక ములకున్న విశ్యాస శుద్ధి కొంత
ఏలికలకున్న, ఎంతైన మేలుగాదె!

(శంకరాభరణం  బ్లాగు లో12-01 -2011 నాటి  సమస్యా పూరణ-195లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, February 12, 2011

వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!

అను నిత్యము, ప్రతి నిముషము
వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
వినవెందుకు దీనులమొర,
గనవెందుకు వారివెతల కరిముఖ గణపా !!

కనకముతో,కాసులతో,
వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
వినయుడనై భక్తి గొలుతు
వినాయకానిన్ను! దీర్చువిఘ్నము లన్నిన్ !

(శంకరాభరణం  బ్లాగు లో09-01 -2011 నాటి  సమస్యా పూరణ-193లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

అమృత పానమ్ము,మరణమ్ము నందజేసె!

ధర్మ మార్గము దప్పని ధార్మికులకు,
సత్య సారము దెలిసిన సాధువులకు
ముచ్చులౌదుష్టులకు హరి ,యిచ్చెనిత్య
అమృత పానమ్ము,మరణమ్ము నందజేసె! 
(శంకరాభరణం  బ్లాగు లో04-01 -2011 నాటి  సమస్యా పూరణ-190లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, February 11, 2011

చెల్లి యని,మగడు పిలువగా చెలియ మురిసె!!!

కలికి కన్నులు ఐశ్వర్య కనుల మించ,
చెలిమి జేసెను ,జేపట్టె ,వలపు పెరిగి,
తల్లి దండ్రికి జూపెట్ట తనను, రంభ
చెల్లి యని,మగడు పిలువగా చెలియ మురిసె!!! 
(శంకరాభరణం  బ్లాగు లో03-01 -2011 నాటి  సమస్యా పూరణ-189లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, February 7, 2011

పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్!

ఏలే నృపులకు, చెడుసల
హాలే చేటగు,యశమునకవి  హానినిడున్ !
మేలే జేయని, కసి,కో
పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్! 
(శంకరాభరణం  బ్లాగు లో08-01 -2011 నాటి  సమస్యా పూరణ-192లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, February 6, 2011

కలహంసల తప్పుగాని కాకుల తప్పే?

పలు మీమాంసలు జేసిరి
పలుహింసల పాలు జేసి,పాలును నీరున్
యిలవేర్జేయని నకిలీ
కలహంసల తప్పుగాని కాకుల తప్పే?

(కమేటీల మీద కమేటీలు వేసి,ప్రకటనల మీద ప్రకటనలు చేసి ప్రజలను కాకులను జేసి, కష్టాలలోకి నెట్టి వేసి, సమస్యను పరిష్కరించడములో మళ్లీ మొదటికొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దృష్టిలో పెట్టుకొని పూరించింది ) (శంకరాభరణం  బ్లాగు లో0701 -2011 నాటి  సమస్యా పూరణ-191లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, February 3, 2011

దాని మానుప భువి నౌషదమ్ము గలదె?

మత్తు కలవాటు పడినట్టి మనిషి యెటుల
మానును మధు సేవనమును ? మాన లేడు,
నష్ట మైనను తనువుకు! మనమున కిష్టమైన
దాని మానుప భువి నౌషదమ్ము గలదె? 
(శంకరాభరణం  బ్లాగు లో02-01 -2011 నాటి  సమస్యా పూరణ-188లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, February 2, 2011

నూతన సంవత్సరమున నూటికి నూఱె!

కోతలు కోయుట మానిన ,
నీతిని పాటించి జనిన, నిర్మల మతితో
చేతలలో పని జూపిన,
నూతన సంవత్సరమున నూటికి నూఱె! 
(శంకరాభరణం  బ్లాగు లో01-01 -2011 నాటి  సమస్యా పూరణ-187లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, February 1, 2011

పూర్ణ చంద్ర వదన, పూబోడి పుత్తడి!!!

పూర్ణ చంద్ర వదన, పూబోడి   పుత్తడి,
కంచి పట్టు చీర కాంతు లీనె,
సకల శాస్త్ర సార సంకేతమై నొప్ప,
సూర్య బింబ మమరె సుదతి నుదుట!

పూర్ణ చంద్ర వదన, పూబోడి  పుత్తడి,
కంచి పట్టు చీర కాంతు లీనె,
కనులు జూడ దివ్య కమలాలుగా దోప
సూర్య బింబ మమరె సుదతి నుదుట!

(శంకరాభరణం  బ్లాగు లో31-12 -2010 నాటి  సమస్యా పూరణ-186లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )