Monday, September 19, 2011

గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి !

ప్రమద గణముల తోడను పత్ని  తోడ
గరళకంఠుండు,పయనించె గరుడు నెక్కి
హరియు సిరితోడ గాంచిరి హస్త ముఖుని
వివిధ రూపాల శోభను విస్మయముగ !!!
(శంకరాభరణం  బ్లాగు లో12-09-2011 నాటి  సమస్యా పూరణ-457లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

2 comments:

  1. బ్రహ్మలోకమ్మునందు సభాస్థలమ్ము
    జేర నందివాహనమెక్కి శివను గూడి
    గరళకంఠుండు పయనించె ; గరుడునెక్కి
    మాధవుడు రమాసతి గూడి మరలె దాను.

    ReplyDelete
  2. కమనీయం గారూ నమస్కారం .మీ పూరణ శివ కేశవులను దర్శింప జేసింది.ఉత్తమంగా ఉంది.

    ReplyDelete