Tuesday, January 31, 2012

వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

సిరికి కోడలమ్మ విరించి విరుల రెమ్మ
బుద్ధి జీవుల పెద్దమ్మ విద్దెలమ్మ 
పదముల   నమస్కరించెడి వాడె,పరుష
వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు. 

 (శంకరాభరణం  బ్లాగు లో28-01-2012 నాటి  సమస్యా పూరణ-605 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Thursday, January 26, 2012

విఱుగఁ బండిన చేలను విడువఁ దగును!!!

కడుపు నింపక మత్తును గలుగ జేసి
మనిషి బుద్దిని వృద్దిని మలిన పరుచు
చెఱుపు గంజాయి మొక్కలు చేల నిండ
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును!!! 

 (శంకరాభరణం  బ్లాగు లో24-01-2012 నాటి  సమస్యా పూరణ-601 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Wednesday, January 25, 2012

కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్!!!

కోటికి పరుగెత్త దలచి
పూటకు లేనట్టి వారి భూముల కెల్లన్
చేటునుతలపెట్టినొకడు
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్!!! 


(శంకరాభరణం  బ్లాగు లో23-01-2012 నాటి  సమస్యా పూరణ-600 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Tuesday, January 24, 2012

గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!

బుజ్జి మూషక వాహనుండగుబొజ్జ దేవుని మ్రొక్కుచున్
ముజ్జగంబుల నేలు వేల్పును ముక్తి నిమ్మని వేడుచున్
ఒజ్జ లందరు మెచ్చు రీతిగ ఉత్పలమ్ముల నల్లుచున్
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే! 


(శంకరాభరణం  బ్లాగు లో22-01-2012 నాటి  సమస్యా పూరణ-599 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Monday, January 23, 2012

చెడుగులతో,దేశమెల్ల శ్రీకర మయ్యెన్!!!

బడుగుల నిడుముల బాపెడు
నుడువులు నుడువుచు ముడుపులనొక్కుచు నధముల్
వెడలగ చెఱసాలకు కడు
చెడుగులతో,దేశమెల్ల శ్రీకర మయ్యెన్!!! 


(శంకరాభరణం  బ్లాగు లో20-01-2012 నాటి  సమస్యా పూరణ-597 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Saturday, January 21, 2012

పాల కడలిన పవళించు పద్మనాభు డేల రక్షించు ?

పాల కడలిన పవళించు పద్మనాభు
డేల రక్షించు దుష్టుల, నేలవిడుచు
పాపులను? బ్రోచులే భగవంతుడెపుడు
సాధు సంతుల సుజనుల సత్య హితుల !!!


(శంకరాభరణం  బ్లాగు లో18-01-2012 నాటి  సమస్యా పూరణ-595 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, January 20, 2012

దారము రక్షించుసాధుతతి నండ్రు బుధుల్!!!

శ్రీరామనామ సారము
శ్రీరాముని పాదరజము శ్రీహరి దయయున్
శ్రీరఘునందను పదమం
దారము రక్షించుసాధుతతి నండ్రు బుధుల్!!! 


(శంకరాభరణం  బ్లాగు లో17-01-2012 నాటి  సమస్యా పూరణ-594 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, January 19, 2012

పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!!!

పిసినారి షావుకారికి
పసలేని పశువు కడివెడుపాల నొసంగెన్
పసిబాలుడు రుచి లేవని
కసికసిగాలేచిపాల కడవను తన్నెన్!!! 

పసిబాలుడు రేపల్లెన
వసుదేవ సుతుండునాడు పశుపాలకుడై
రసములు పొదుగున నింపగ
పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!!!  



(శంకరాభరణం  బ్లాగు లో16-01-2012 నాటి  సమస్యా పూరణ-593లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, January 18, 2012

తమ్ములను నుతింతు నెమ్మనమున !!!

కలిమి లేము లందు కష్ట సుఖములందు
కలసియుండు వారు ఘనులు భువిని,
ధర్మ పథము నెపుడు దప్పని తనతండ్రి
తమ్ములను నుతింతు నెమ్మనమున !!! 


 (శంకరాభరణం  బ్లాగు లో13-01-2012 నాటి  సమస్యా పూరణ-590 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, January 17, 2012

సంగీతము విన్న వారు చచ్చిరి త్రుటిలో !!!

సంగతులన్నియు తడబడ
సంగీతము విన్న వారు చచ్చిరి!!! త్రుటిలో
చెంగున లేచిరి ఎమ్మెస్
సంగీతము జాలువార సభికులు సభలో !!!


 (శంకరాభరణం  బ్లాగు లో12-01-2012 నాటి  సమస్యా పూరణ-589 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, January 16, 2012

ధర్మ విధులకు బూజ్యుండు త్రాగుబోతు

ధర్మ విధులకు బూజ్యుండు త్రాగుబోతు
వదరుబోతు పొగరు  బోతు పచ్చి తిరుగు 
బోతు గాడుగాబోడు నెపుడు,సుగుణము
దయయు గలిగిన వాడెపో తగిన వాడు !!!


 (శంకరాభరణం  బ్లాగు లో11-01-2012 నాటి  సమస్యా పూరణ-588 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, January 15, 2012

ధాన్య ముండు నింట దైవ ముండు!!!

ధాన్య ముండు నింట దైవ ముండునటంద్రు
దైవ మున్న యింట ధైర్య ముండు
ధైర్య ముండు నింట దైన్యమ్ము పరుగంట
భోగములకు పంట భోగి మంట!!! 

 (శంకరాభరణం  బ్లాగు లో14-01-2012 నాటి  సమస్యా పూరణ-591లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, January 14, 2012

జనుల కిడుగాక శుభములు జయము గలుగ !!!

పాడి పంటల నిచ్చెడు  పార్వతమ్మ
చదువు సంధ్యల నొసగెడు చదువులమ్మ
సిరుల నిచ్చెడు శ్రీ లక్ష్మి  కరుణ  మీర
వచ్చి   నిలిచిన సంక్రాంతి లచ్చుమమ్మ
జనుల కిడుగాక శుభములు  జయము గలుగ !!!

నామంబుల లోన పంగనామము మేలౌ!!!

నామంబన నమ్మించుట
నామంబన వంచనయట నామంబనగా
నేమార్చిదోచుకొనుటట
నామంబుల లోన పంగనామము మేలౌ!!! 


(శంకరాభరణం  బ్లాగు లో 06-01-2012 నాటి  సమస్యా పూరణ-582 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, January 13, 2012

పాతకాలపు టలవాట్లు పాడు చేయు!!!

మార్పు సహజమ్ము కాలమ్ము  మారుచుండు
మారు దశలును ధర్మమ్ము మారి పోవు
మంచి జేయని, తగురీతి మార లేని
పాతకాలపు టలవాట్లు పాడు చేయు!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 10-01-2012 నాటి  సమస్యా పూరణ-587 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, January 12, 2012

మారు పూజింతు దైత్య సంహారు ధీరు!!!

రమ్యగుణసాంద్రు రాజేంద్రు రామచంద్రు,
భద్రగిరివాసు దరహాసు భక్తపోషు ,
రుచిత మణిహారు వీరు శూరు దశరథకు
మారు పూజింతు దైత్య సంహారు ధీరు!!!

(శంకరాభరణం  బ్లాగు లో 05-01-2012 నాటి  సమస్యా పూరణ-581 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, January 11, 2012

మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్ !!!

గద్యములకు గేయములకు
పద్యములకు పాటలకును ప్రాణము తెలుగే ,
చోద్యముమరి పరభాషా
మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్ !!!
(శంకరాభరణం  బ్లాగు లో 23-12-2011 నాటి  సమస్యా పూరణ-569 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, January 10, 2012

కలిమి మాయ మైన వెలయాలు దరిరాదు!!!

కలిమి మాయ మైన వెలయాలు దరిరాదు
పదవి దూర మైన  ప్రజలు రారు
కట్ట తెగిన చెఱువు పట్టునే  జలముల ?
మంద వారి మాట మణుల మూట!!!

ధర్మ మర్మంబు నెఱిగిన కర్మ యోగి!!!

సత్య పథమున నడిచిన  సాదుముర్తి
ధర్మ   మర్మంబు నెఱిగిన కర్మ యోగి
భరత భువిలోన పుట్టిన  బాపు గాంధి
విగ్రహములతో నిండెను వీధులెల్ల!!!

(శంకరాభరణం  బ్లాగు లో 09-01-2012 నాటి  సమస్యా పూరణ-586 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, January 9, 2012

నీటి యందు వాన నీరు మంచి !!!


అన్నిబలము లందు నాత్మబలముమిన్న    
నీటి లోన వాన నీరు మిన్న 
వెలుగు లందు కంటి వెలుగుయే మిన్నరా !!!
మంద వారి   మాట మణుల మూట  !!!

Thursday, January 5, 2012

మధుర మైన వాక్కు,కుదురైన నడవడి,

మధుర మైన వాక్కు,కుదురైన నడవడి,
దాన గుణము ,దయయు, దైవ భక్తి
గలుగు వాడు బొందు ఘనమైన సౌఖ్యమ్ము
మంద వారి మాట మణుల మూట!!!