Saturday, June 29, 2013

ఏకాగ్రత !!!

లోకోపకారమునకై
యేకాగ్రత తోడజేయు నేపనియైనన్
శ్రీకరమౌ తపమేయగు
చేకూర్చును తగుఫలములు శ్రేయస్కరమౌ  !!!

Monday, June 24, 2013

వదలగ వలె మత్సరంబు!!!

చదువగవలె శాస్త్రంబుల,
వదలగ వలె మత్సరంబు, పరహితమెపుడున్
మెదలగవలెమదికోపము
నదమగవలె ,ధర్మ పథమునరుగగ వలెరా !!!