గజ్జెలందియలు ఘల్లు ఘల్లని మ్రోయ
నహిమౌలి తాండవం బాడె నెద్ది
భువన పావనమైన దివిజ స్రవంతికి
ప్రభవ కారణ మౌ చు బరిగె నెద్ది
స్వారాజ్యమును గొన్న వైరోచనుని ద్రొక్కి
పాతాళ భూమికి బంపె నెద్ది
పతి శాప వశమున గతి లేక పడియున్న
చట్రాతి నాతిగా సలిపె నెద్ది
ఆది లక్ష్మి నిచ్చెడు వేళ నబ్దిరాజు
కనకపుం బల్లెరమున కడిగె నెద్ది
అట్టి నీ పాద పంకజం బమల చరిత
నా కఠిన దేహమును దాకి నవసి యుండు.
( చిలకమర్తి గారి గయోపాఖ్యానము లోనిది )
No comments:
Post a Comment