Monday, August 8, 2016

దేవుండొకడే !!!


ఎదిగెడు తరువుల కెవ్వడు
పొదిగెను పూవులను ప్రొద్దు పొడవక మునుపే
కదిలీ కదలని ప్రాణుల
వదలక నిడిపించు రేడు వాడే జగతిన్ !!!

నను రక్షించెడు వేలుపు
నిను సైతము రక్షచేయు నిక్కము సుమ్మూ
ననునిను చరాచరమ్ముల
దినదినమున రక్షజేయు దేవుండొకడే !!!

No comments:

Post a Comment